Dil Raju Speech at F3 Movie Pre Release event

Sunday,May 22,2022 - 11:37 by Z_CLU

"ఎఫ్ 3 రెండున్నర గంటల పాటు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అనిల్ రావిపూడి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ గా డిజైన్ చేశారు. వెంకటేష్, వరుణ్ లాంటి గొప్ప నటులు మాకు హీరోలుగా దొరికారు. తమన్నా , మేహారీన్, సోనాల్ , రాజేంద్ర ప్రసాద్ గారు అలీ ,సునీల్ ఇలా చాల మంది మంచి నటులు ఈ సినిమాలో పూర్తి వినోదాన్ని పంచుతారు. ఈ సినిమాలో టెక్నిషిన్లందరు చక్కగా చేశారు. ఎఫ్ 2ని ఎంత చక్కగా ఎంజాయ్ చేశారో దాని కంటే గొప్పగా ఎఫ్3 ని ఎంజాయ్ చేస్తారు. ఎఫ్ 2లో వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు ఎంత కెమిస్ట్రీ పండించారో ఎఫ్ 3లో దానికి మించి వుంటుందని ట్రైలర్ చూస్తే మీకు అర్ధమైవుంటుంది. ఎఫ్ 2లో ఇద్దరు హీరోయిన్ లు వుంటే ఎఫ్ 3కి వచ్చేసరికి నలుగురు అయ్యారు.సెన్సార్ వాళ్ళు ఆల్రెడీ సినిమా చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఫుల్ మీల్స్ లా వుంటుందని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ తో మాది నాన్ స్టాప్ సక్సెస్ జర్నీ, ఎఫ్ 3కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ ఫిదా,,ఎఫ్ 2.. ఇప్పుడు ఎఫ్ 3తో హ్యాట్రిక్. అలాగే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2. ఎఫ్ 3 హ్యాట్రిక్. అనిల్ రావిపూడితో సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్ 3.. తర్వాత ఆరో సినిమాతో డబుల్ హ్యాట్రిక్. మే 27న ఎఫ్ 3వస్తుంది. మీ అందరినీ తప్పకుండా అలరిస్తుంది''