Dil Raju lined up 5 movies for 2021

Friday,December 25,2020 - 10:12 by Z_CLU

బడా నిర్మాత దిల్ రాజు కాంపౌండ్ లో ఇప్పుడు ఐదు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన సినిమాల షూటింగ్స్ తో పాటు కొత్త సినిమాలు కూడా సెట్స్ పై పెట్టేసి నిర్మాతగా ఓ లుక్కేస్తున్నాడు దిల్ రాజు. అవును తన బ్యానర్ లో తెరకెక్కుతున్న ఐదు సినిమాల షూటింగ్స్ తో రాజు గారు ఫుల్ బిజీగా ఉన్నారు .

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'Vakeel Saab' సినిమాతో పాటు వెంకీ, వరుణ్ తేజ్ 'F3' కూడా షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు నాగచైతన్య 'Thank You', విశ్వక్ సేన్ 'Paagal', నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా హర్ష దర్శకత్వంలో రాబోతున్న సినిమా కూడా షూటింగ్ స్టేజిలో ఉంది.

ఇలా వరుసగా ఐదు సినిమాలను రెడీ చేస్తున్న రాజు గారు వచ్చే ఏడాది వీటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమాలతో రాజు గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని నిర్మాతగా అరుదైన రికార్డు అందుకుంటారేమో చూడాలి.