Dil Raju hosted RRR succes party, here’s the details

Tuesday,April 05,2022 - 01:07 by Z_CLU

మార్చ్ 25న గ్రాండ్ గా రిలీజైన RRR అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో 12 మిలియన్ డాలర్ ని క్రాస్ చేసింది.  నార్త్ లో 200 కోట్ల మార్క్ కి చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వాసుళ్ళు అందుకుంటూ దూసుకెళ్తుంది. ముఖ్యంగా నైజాంలో 100 కోట్ల మార్క్ దాటింది. ఈ సందర్భంగా గ్రాండ్ గా RRR సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు దిల్ రాజు.

హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన ఈ పార్టీకి RRR టీంతో పాటు టాలీవుడ్ సెలెబ్రిటీస్ కూడా ఎటెండ్ అయ్యారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ తమ సతీమనులతో కలిసి పార్టీకి హాజరయ్యారు. పార్టీలో అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి వేసిన నాటు నాటు స్టెప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ పార్టీలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ RRR కి సీక్వెల్ ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

దిల్ రాజు ఇచ్చిన సక్సెస్ పార్టీలో RRR టీం ఫుల్ గా ఎంజాయ్ చేశారు. పార్టీకి వచ్చిన దర్శకులు రాజమౌళిని అలాగే తారక్ , చరణ్ లతో టీంని అభినందించి స్పీచ్ లతో ఆకట్టుకున్నారు.

[video width="636" height="360" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2022/04/DilRaju-RRR-Party.mp4"][/video]     Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics