Dil Raju gives a clarity on Industry Strike Here’s the Details behind the Meeting

Monday,July 18,2022 - 01:33 by Z_CLU

తాజాగా తెలుగు సినిమా ప్రొడ్యుసర్ గిల్డ్ ఓ మీటింగ్ పెట్టుకొని ఇండస్ట్రీలో సమస్యలపై అలాగే థియేటర్స్ మనుగడ గురించి చర్చించుకున్నారు. అయితే ఈ మీటింగ్ లో నిర్మాతలు స్ట్రైక్ గురించి ఏదో నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే షూటింగ్స్ బంద్ చేయబోతున్నారని ఓ న్యూస్ బయటికొచ్చింది. దీనిపై తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ అసలు విషయం బయట పెట్టారు. మీటింగ్ లో నిర్మాతల గిల్డ్ చర్చించుకున్నవి మూడు విషయాలని చెప్పారు.

అందులో భాగంగా కంటెంట్ , ఓటీటీ రిలీజ్ , టికెట్ రేటు ఇలా మూడు విషయాలపై ఎక్కువ సేపు చర్చ జరిగిందని ఆయన అన్నారు. ముఖ్యంగా నిర్మాతలు -దర్శకులు కలిసి తాము తీయబోయే కంటెంట్ మీద రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అదే మాట్లాడుకున్నామని అన్నారు. దీనికి కారణం తెలుగు ప్రేక్షకులు కోవిడ్ టైంలో వరల్డ్ వైడ్ కంటెంట్ చూసి సాధారణ కంటెంట్ కోసం థియేటర్స్ కి రాలేకపోతున్నారని, ఇప్పుడు కోవిడ్ టైంలో ఖాళీగా ఉండి రాసుకున్న కథలు , సెట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ మీద శ్రద్ధ పెట్టాలని అందులో భాగంగా తను కూడా ప్రొడక్షన్ లో ఓకె అనుకున్న కథలు పక్కన పెట్టేసానని అన్నారు. అలాగే షూటింగ్ కి రెడీ అవుతున్న రెండు సినిమాలను డ్రాప్ చేసి మళ్ళీ రివిజన్ చేస్తున్నాని తెలిపారు.

ఇక ఓటీటీ లో త్వరగా రిలీజ్ చేయడం వల్ల కూడా థియేటర్స్ కి జనాలు రావడం లేదని, దాని మీద ఫోకస్ పెట్టి పది వారాల వరకూ డిజిటల్ రిలీజ్ లేకుండా ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. ఎఫ్ 3, థాంక్యూ విషయంలో తను అలాంటి జాగ్రత్త తీసుకొని మొదటి అడుగు వేశానని అన్నారు. అలాగే టికెట్ రేటు కూడా సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు దాని మీద డిస్కషన్స్ జరిపినట్లు చెప్పారు. ఈ మూడు విషయాలపై చర్చ జరిపినట్లు చెప్తూ స్ట్రైక్ పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత దిల్ రాజు.  మరి నిర్మాతలు ఈ మూడు ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ థియేటర్స్ కి పునపటి రోజులు రావడం ఖాయం.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics