Dil Raju confidence on Shaadi Mubarak
Friday,February 26,2021 - 04:20 by Z_CLU
సినిమా చిన్నదా పెద్దదా అనేది ఇంపార్టెంట్ కాదు. అందులో కంటెంట్ ఎంత బాగుందనేది ఇంపార్టెంట్. అందుకే షాదీ ముబారక్ సినిమా దిల్ రాజును ఎట్రాక్ట్ చేసింది. ఈ మూవీ కంటెంట్ చూసి ఫిదా అయ్యాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బయటపెట్టారు.
⇒ ‘షాదీ ముబారక్’ సినిమా విషయానికి వస్తే.. యూనిట్ సినిమాను పూర్తి చేసుకున్న తర్వాత ఓరోజు సాగర్ నాకు సినిమా ట్రైలర్‌ను చూపించాడు. చాలా ఆసక్తికరంగా అనిపించడంతో సినిమా చూస్తానని అన్నాను. సినిమా చూశాను. అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ తప్పితే సినిమా అంతా హిలేరియస్ ఎంటర్టైనర్గా అనిపించింది. సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.
⇒ నాకు సినిమాపై ఉన్న ఆలోచనను ఎలా చేయాలో శ్రీనివాస్ రెడ్డిగారికి, సాగర్‌కి చెప్పాను. వాళ్లు బాల్ని నా కోర్టులో వేశారు. నేను నాకు అనిపించిన కరెక్షన్స్ గురించి చెప్పాను. వాళ్లు దాన్ని కరెక్షన్స్ చేశారు. తర్వాత సినిమాను రిలీజ్ చేయమని మరోసారి బాల్‌ను నా కోర్టులోనే వేశారు. మంచి సినిమాను మా బ్యానర్ నుంచి రిలీజ్ చేద్దామని నిర్ణయించుకుని సినిమాను టేక్ ఓవర్ చేసుకున్నాం.
⇒ సినిమా మ్యూజికల్‌గా కానీ, ఎంటర్టైన్మెంట్కానీ అన్నీ బావున్నాయి. దర్శకుడు పద్మశ్రీ ఓ కొత్త పాయింట్‌తో సినిమాను తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ చూస్తే సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిందని అర్థమై ఉంటుంది. రెండు గంటల పదిహేను నిమిషాల ఈ సినిమా అంతా నవ్విస్తూనే ఉంటుంది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మూవీ. సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అది నా గ్యారంటీ.