Different Thriller Movie A Releases on March 5

Sunday,February 14,2021 - 10:02 by Z_CLU

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘A’.

ఈ సినిమా టీజర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విజయ్ కురాకుల సంగీత సారథ్యంలో అనంత్ శ్రీరామ్ అద్భుత సాహిత్యాన్ని అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆల్రెడీ మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్నాయి..

Different Thriller Movie A March 5 release 1

సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ‘A’ చిత్రాన్ని వర‌ల్డ్ వైడ్‌గా మార్చి 5న పీవీఆర్ సినిమా విడుద‌ల ‌చేస్తుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నితిన్ ప్రసన్న, హీరోయిన్ ప్రీతి అస్రాని, దర్శకుడు యుగంధర్ ముని, సంగీత దర్శకుడు విజయ్ కురాకుల, కెమెరామెన్ ప్రవీణ్ కె. బండారి, ప్రాజెక్ట్ డిజైనర్ వినయ్, ఎడిటర్ ఆనంద్, పివిఆర్ ప్రతినిధి ఉదయ్ కుమార్ పాల్గొన్నారు..

అనంతరం "A" చిత్రంలోని, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్, పాటల్ని ప్రదర్శించారు.. హైటెక్నీకల్ విజువల్స్ తో ఇంట్రెస్టింగ్ గా రూపొందిన "A" సినిమాలోని ట్రైలర్స్ సాంగ్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేశాయి.