Coutdown begins for Acharya

Tuesday,April 19,2022 - 12:47 by Z_CLU

మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరూ కలిసి నటిస్తున్న 'ఆచార్య' ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అయింది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న మెగా మూవీ ఏప్రిల్ 29న థియేటర్స్ లోకి రాబోతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిరు , చరణ్ కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

రిలీజ్ కి ఇంకా పది రోజులే ఉండటంతో నేటి నుండి సోషల్ మీడియాలో సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది. పది రోజుల్లో మెగా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తుంటే, 'ఆచార్య' తెలుగు రాష్ట్రాల్లో  కొత్త రికార్డులు సృష్టించడం పక్కా అంటూ ఫ్యాన్స్ లెక్కలేసుకుంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు.

సినిమాలో ఉన్న కంటెంట్ ని ఎలివేట్ చేస్తూ తాజాగా రిలీజైన ట్రైలర్ 'ఆచార్య' పై అంచనాలు పెంచేసింది. అలాగే చిరు , చరణ్ ఎలా కలుస్తారు ? కథలో వీరిద్దరికీ ఎలాంటి సంబంధం ఉంటుంది ? అనే ప్రశ్నలు కూడా ఆడియన్స్ లో స్టార్టయ్యాయి. కాజల్ , పూజ హెగ్డే ఇద్దరు హీరోయిన్స్ ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆచార్య తో చిరు , చరణ్ బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తారో ? ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

   
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics