count down starts for Mahesh movie hungama

Friday,May 21,2021 - 06:54 by Z_CLU

మహేష్ ఫెస్టివల్ ఏంటి ? అనుకుంటున్నారా ? అవునండీ సరిగ్గా పది రోజుల్లో 31న మహేష్ సినిమా అప్డేట్స్ , ఫస్ట్ లుక్ , టైటిల్ ఎనౌన్స్ మెంట్స్ తో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకోబోతున్నారు. #SSMBRampageOnMAY31st అంటూ అ రోజు మహేష్ ఫెస్టివల్ గా డిసైడ్ చేసి ట్విట్టర్ లో హంగామా మొదలు పెట్టారు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ అప్ కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట' ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. అలాగే మోషన్ పోస్టర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక అదే రోజు మహేష్ -త్రివిక్రమ్ సినిమా టైటిలే కూడా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.

mahesh babu zeecinemalu 2

సో నెలాఖరున ఈ రెండు సినిమాల ప్రకటనలు రానున్నాయి. ఇక 'సర్కారు వారి పాట' పాటలో మహేష్ లుక్ ఎలా ఉండనుందో హింట్ ఇస్తూ ప్రీ లుక్ పోస్టర్స్ వదిలారు మేకర్స్. అప్పటి నుండి మహేష్ ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు సూపర్ ఫ్యాన్స్. అలాగే మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు పలు టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారా ? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 'పార్థు','అతడే ఒక సైన్యం' టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ రెండు సినిమాల అప్డేట్స్ తో సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే మహేష్ ఫ్యాన్స్ కి మరింత స్పెషల్ డే కానుంది. మరి #SarkaruVaariPaataFirstlook , #SSMB28Title సినిమా టైటిల్ తో ఆరోజు మహేష్ ట్విట్టర్ లో ఎలాంటి ట్రెండ్ సృష్టిస్తాడో చూడాలి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics