Corona Effect on Upcoming movie releases

Wednesday,April 14,2021 - 05:55 by Z_CLU

ప్రస్తుతం కరోన సెకండ్ వేవ్ కొనసాగుతుంది. మిగతా రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈసారి వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఆ ఎఫెక్ట్ మళ్ళీ సినిమా పరిశ్రమపై పడింది. లాక్ డౌన్ తర్వాత ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ వరకూ వచ్చిన సినిమాలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య 'లవ్ స్టోరి' తో పాటు నాని 'టక్ జగదీష్' కూడా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడిన లిస్టులో మరో సినిమా చేరింది. రానా 'విరాట పర్వం' సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. అయితే కరోన వ్యాప్తి కారణంగా సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ఎనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ మూడు సినిమాలే కాదు మేలో విడుదలవ్వాల్సిన మరికొన్ని సినిమాలు ఇప్పుడు వాయిదా బాట పడుతున్నాయి. బడా సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ముఖ్యంగా మెగాస్టార్ 'ఆచార్య',తో పాటు వెంకటేష్ 'నారప్ప' కూడా వాయిదా వేయబోతున్నారని తెలుస్తుంది. కరోన వ్యాప్తి ప్రభావం దాదాపు మే నెలాఖరు లేదా జూన్ వరకూ విసృతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఆచార్య ని జూన్ లో విడుదల చేయదానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఏదేమైనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తర్వాత మెల్ల మెల్లగా కోలుకుంటూ మంచి విజయాలతో కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తున్న టాలీవుడ్ పై మరోసారి కోవిడ్ ఎఫెక్ట్ పడింది. మరి జూన్ నుండైన కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయా ? లేదా జులై ఆగస్ట్ కి వెళ్తాయా ? చూడాలి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics