Confusion on RRR Release Date

Thursday,August 12,2021 - 03:49 by Z_CLU

ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న 'RRR' ప్రకటించినట్లే చెప్పిన డేట్ కే వస్తుందా ? ఇదే ఇప్పుడు మూవీ లవర్స్ మధ్య హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో ఎట్టి పరిస్థితుల్లో రానుందని మొన్నటి వరకు మేకర్స్ గట్టిగా చెప్పారు. దీంతో అందరు సినిమా మరో రెండు నెలలో థియేటర్స్ లోకి రానుందని సంతోష పడ్డారు.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. RRR ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలి. బాహుబలి ప్రాంచైజీ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అక్టోబర్ లో మొత్తం అన్ని చోట్ల థియేటర్స్ తెరిచే పరిస్థితి కనబడట్లేదు. ఇంకా కోలీవుడ్, బాలీవుడ్ డైలామాలోనే ఉన్నాయి. అక్కడ ఇంకా థియేటర్స్ తెరవలేదు. ఇంకా రెండు నెలలు ఉంది కదా అనుకోవడానికి లేదు. అప్పటికైనా కచ్చితంగా ఓపెన్ అవుతాయా? అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు.

అందుకే బడా సినిమాలన్నీ ఈ ఏడాది ని వదిలేసుకున్నాయి. ఒక్క పుష్ప మాత్రం ఈ ఏడాది డిసెంబర్ లో అనౌన్స్ చేశారు. ఇక ఆచార్య రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో RRR ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు భోగట్టా. కాకపోతే సంక్రాంతి కాకుండా రిపబ్లిక్ డే రోజు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని ఇన్సైడ్ టాక్. మరి చూడాలి రాజమౌళి చెప్పిన డేట్ కే సినిమాను తీసుకొస్తాడా? లేదా అంతా అనాల్సీస్ చేసుకొని వచ్చే ఏడాదికి థియేటర్స్ లో దింపుతాడా?

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics