Confusion continues going on ‘Bheemla Nayak’ Release date

Sunday,February 13,2022 - 10:00 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా ఎప్పుడొస్తుంది ? ప్రెజెంట్ ఇండస్ట్రీ లో అటు అభిమానుల్లో హాట్ టాపిక్ అవుతున్న మేటర్ ఇది. నిజానికి అన్ని బడా సినిమాలకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ డేట్స్ వచ్చేశాయి. భీమ్లా నాయక్ సినిమా డేట్ కూడా చెప్పేశారు. ఫిబ్రవరి 25 న లేదా ఏప్రిల్ 1 అంటూ రెండు డేట్స్ చెప్పారు. అయితే ఈ కన్ఫ్యూజన్ పై ఇంకా క్లారిటీ రాలేదు. మేకర్స్ ఇప్పటి వరకూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకూ ఈ రెండు డేట్స్ లో ఏప్రిల్ 1 కే సినిమా వచ్చే అవకాశం ఉంది. దీనికి రీజన్ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఒక సాంగ్ తో పాటు ప్యాచ్ వర్క్ ఉంది. ప్రస్తుతం ఆ షూట్ ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు యూనిట్. త్రివిక్రమ్ కూడా సెట్ లో ఉంటూ షూట్ స్పీడ్ గా ఫినిష్ అయ్యేలా చూస్తున్నారట. మేకర్స్ చెప్పిన మొదటి డేట్ అంటే ఫిబ్రవరి 25కి ఇంకా పది రోజులే ఉంది. ఈ లోపు షూటింగ్ పూర్తి చేయడమే కాదు పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆలాగే సెన్సార్ చేయించాలి. ఇన్ని పనులున్నాయి కనుక హడావుడిగా సినిమాను థియేటర్స్ లోకి దింపడం కంటే ఇంకో నెల ఆగి ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేయడం బెటర్ అని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే RRR లాగే ఈ సినిమా కూడా రెండు డేట్స్ కాకుండా మరో డేట్ ఏమైనా సెట్ చేసుకుంటుందా ? అనే ప్రశ్నకి ఇటివలే సమాధానం ఇచ్చాడు నిర్మాత నాగ వంశీ. రెండు డేట్స్ లో ఒక డేట్ కె సినిమా రానుందని తెలిపాడు. అంటే ఫిబ్రవరికి కష్టం కనుక సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవ్వడం ఖయమని చెప్పొచ్చు.