#Chiru153 – Megastar becomes Godfather

Saturday,August 21,2021 - 06:12 by Z_CLU

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి నెక్స్ట్ మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా 'లూసిఫర్' ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటివలే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాకు ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టే 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ అనుకున్న మేకర్స్ ఫైనల్ గా 'గాడ్ ఫాదర్' అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేశారు. తాజాగా ఈ టైటిల్ లోగో పోస్టర్ ని మెగా స్టార్ జన్మదినం సందర్భంగా హ్యాపీ బర్త్ డే మెగా స్టార్ అంటూ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి చిరుకి విషెస్ చెప్తూ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపారు మేకర్స్.

మెగా స్టార్ కాప్ పెట్టుకొని బ్యాక్ సైడ్ షాడో స్టిల్ తో ఉన్న గాడ్ ఫాదర్ లోగో పోస్టర్ ప్రస్తుతం అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రస్తుతం మెగా స్టార్ మిగతా నటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యుల్ జరగనుంది. రెండో షెడ్యుల్ లో మిగతా నటీ నటులపై మరికొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. ఆ షెడ్యుల్ లో నయనతార , సత్య దేవ్ తో పాటు మిగతా నటీ నటులు జాయిన్ అవుతారు.

వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు లక్ష్మి భూపాల మాటలు అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై సురేఖ కొణిదెల సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బేనర్ పై NV ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics