Chiranjeevi’s Waltair Veerayya Creates record in Overseas

Monday,January 16,2023 - 03:43 by Z_CLU

చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించాడు. సెకెండాఫ్ లో తన విశ్వరూపం చూపించాడు. అలా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో సూపర్ హిట్టయింది.

ఇంకా చెప్పాలంటే, రిలీజైన 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది. యూఎస్ఏలో తాజాగా 1.7 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది ఈ సినిమా. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఓవర్సీస్ బయ్యర్లందరికీ లాభాలు తెచ్చిపెట్టింది. (Waltair Veerayya Overseas Collections)

కరోనా తర్వాత ఓవర్సీస్ లో ఇలా అతి తక్కువ టైమ్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమా వాల్తేరు వీరయ్య మాత్రమే. అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ తర్వాత రికార్డ్ కూడా దీనిదే.

గట్టిపోటీ మధ్య థియేటర్లలో రిలీజైంది వాల్తేరు వీరయ్య. అప్పటికే థియేటర్లలో వీరసింహారెడ్డి ఉంది. అయినప్పటికీ చిరు సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పైగా రెండో రోజు బాలయ్య సినిమాకు నెగెటివ్ టాక్ రావడం ఓవర్సీస్ లో మెగాస్టార్ కు ఎదురులేకుండా పోయింది.

ఈరోజు ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడం ఖాయం అంటోంది ట్రేడ్. అదే కనుక జరిగితే ఓవర్సీస్ లో చిరంజీవి మంచి రికార్డ్ సృష్టించినట్టే.

అతడు నటించిన గాడ్ ఫాదర్, ఆచార్య సినిమాలు ఓవర్సీస్ లో ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు వాల్తేరు వీరయ్యతో బౌన్స్ బ్యాక్ అయ్యారు మెగాస్టార్.