Chiranjeevi’s Lucifer Remake in Vinayak Hands

Thursday,September 24,2020 - 02:38 by Z_CLU

కొన్ని రోజులుగా Mega Star రీమేక్ చేయబోతున్న Lucifer దర్శకుడి విషయంలో రకరకాల ప్రచారం జరుగుతుంది. Saaho దర్శకుడు Sujeeth డైరెక్ట్ చేయబోతున్నాడని , దానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఒక సమయంలో చిరునే స్వయంగా ప్రకటించారు. దాంతో మూడో సినిమాకే సుజీత్, చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడంటూ వార్తలొచ్చాయి. కానీ కొన్ని రోజులకే మళ్ళీ ఈ రీమేక్ కి దర్శకుడిగా VV Vinayak పేరు తెరపైకొచ్చింది. కానీ దీనిపై మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ మెగా రీమేక్ ని డీల్ చేసేది వినాయకే అని తెలుస్తుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ వినాయక్ చేతికి వెళ్ళిపోయిందని స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. తాజాగా బెంగుళూరు వెళ్లి Chiranjeevi-Vinayak భేటి అయ్యాడని ఇద్దరూ మార్పులు చేర్పులపై ఫైనల్ గా మాట్లాడుకున్నారట.

అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే వినాయక్ దర్శకుడిగా ఈ మెగా రీమేక్ ఎనౌన్స్ కానుంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఆచార్య షూటింగ్ పూర్తయిన తర్వాత లూసిఫర్ రీమేక్ ను ఎనౌన్స్ చేస్తారు.