Chiranjeevi’s Acharya to release on September end or October 1st

Wednesday,August 04,2021 - 12:01 by Z_CLU

సంక్రాంతికి పవన్, మహేష్, ప్రభాస్ సినిమాలు లాక్ అయ్యాయి. ఇక క్రిస్మస్ కు పుష్ప సినిమా షెడ్యూల్ అయింది. దీంతో ఆచార్య సినిమాకు మంచి అకేషన్ దొరకలేదంటూ వరుసగా స్టోరీలు వచ్చేశాయి. అయితే ఆచార్యకు అన్నింటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఒకటి దొరికింది. పైన చెప్పుకున్న సినిమాల కంటే ముందే ఈ సినిమా వస్తోంది.

అవును.. అన్నీ అనుకున్నట్టు కుదిరితే అక్టోబర్ 1న ఆచార్య సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అంటే.. సంక్రాంతి సినిమాలతో పాటు, RRR రిలీజ్ కంటే ముందే ఆచార్య థియేటర్లలోకి వస్తుందన్నమాట. అక్టోబర్ 1 మాత్రమే కాదు, సెప్టెంబర్ 30 కూడా ఆచార్యకు అందుబాటులో ఉంది. ఆరోజున థియేటర్లలోకి వస్తే లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది. పైగా అప్పటికి దసరా సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, పండగ రిలీజ్ కిందే లెక్క.

సెప్టెంబర్ లాస్ట్ లేదా అక్టోబర్ ఫస్ట్ న ఆచార్య వస్తే చాలా ఉపయోగాలున్నాయి. థియేటర్లలో ఎలాంటి పోటీ ఉండదు. కావాలంటే వకీల్ సాబ్ టైపులో వందకు వందశాతం థియేటర్లు ఆచార్యకే వస్తాయి. ఆ తర్వాత 2 వారాల గ్యాప్ లో RRR వచ్చినప్పటికీ ఆచార్యకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే, ఈ కాలం 2 వారాలు ఫుల్ రన్ అంటే మామూలు విషయం కాదు. పైగా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. ఆ 2 వారాలు చాలు.. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడానికి. ఇదే ఆచార్య ప్లాన్ గా కనిపిస్తోంది.

మరోవైపు ఈ తేదీలకు సినిమాను విడుదల చేయడానికి ఆచార్యకు పెద్దగా అడ్డంకులు కూడా ఏమీ లేదు. మూవీకి సంబంధించి ఒకే ఒక్క సాంగ్ పెండింగ్ ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్ పని మీద ఉన్న రామ్ చరణ్, అట్నుంచి ఇటు వచ్చిన వెంటనే.. పూజా హెగ్డే కాంబినేషన్ లో ఆ సాంగ్ పూర్తిచేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులైతే దాదాపు పూర్తయిపోయాయి. పైగా ప్రమోషన్ కు దాదాపు 2 నెలల టైమ్ కూడా దొరుకుతోంది. సో.. చూస్తుంటే.. ఆచార్యకు అన్నీ కలిసొస్తున్నట్టే ఉన్నాయి. ఇక రికార్డులు తిరగరాయడమే ఆలస్యం.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics