Chiranjeevi tests negative for CORONA the earlier kit was faulty

Friday,November 13,2020 - 12:25 by Z_CLU

తనకు కరోనా సోకిందంటూ 5 రోజుల కిందట మెగాస్టార్ చిరంజీవి ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతా షాక్ అయ్యారు. అలా 5 రోజులుగా హోం ఐసొలేషన్ లో ఉన్న మెగాస్టార్.. తాజాగా తను కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రకటించారు.

నిజానికి చిరంజీవి (Chiranjeevi) కి కరోనా లేదు. ఆచార్య షూటింగ్ ప్రిపరేషన్ లో భాగంగా ఫాల్టీ కిట్ వాడ్డంతో, అందులో చిరంజీవికి పాజిటివ్ వచ్చినట్టు చూపించింది. అయితే రీసెంట్ గా చిరంజీవి సీటీ స్కాన్ చేయించుకున్నారు. అందులో ఎలాంటి traces కనిపించలేదు.

తర్వాత 3 రకాల కిట్స్ తో టెస్ట్ చేయించుకున్నారు. అందులో కూడా నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ ఎక్కడైతే టెస్ట్ చేయించుకున్నారో అక్కడ మరోసారి RT PCR టెస్ట్ చేయించుకున్నారు. అక్కడ కూడా నెగెటివ్ వచ్చింది.

దీంతో తనకు కరోనా లేదనే విషయాన్ని చిరంజీవి అఫీషియల్ గా ప్రకటించారు. కేవలం తప్పుడు కిట్ ఉపయోగించడం వల్ల తనకు కరోనా వచ్చినట్టు చూపించిందంటున్నారు మెగాస్టార్. మొత్తమ్మీద చిరంజీవికి కరోనా లేదని తెలియడంతో మెగాఫ్యాన్స్ అంతా హ్యాపీ ఫీలవుతున్నారు.

Also Read - చిరంజీవికి కరోనా