Chiranjeevi shares a updates on Tarakaratna’s health

Tuesday,January 31,2023 - 11:31 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో తారకరత్న (Tarakaratna) హెల్త్ గురించే చర్చ నడుస్తుంది. పొలిటికల్ గా కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి హాట్ టాపిక్ గా మారింది. కుప్పంలో సృహ తప్పి పడిపోయిన తారకరత్నను హుటా హుటిన బెంగళూరులో ఓ హాస్పిటల్ లో తీసుకెళ్లారు. ప్రస్తుతం తారకరత్నకు అక్కడే ట్రీట్ మెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమకి తెలిసిన సమాచారం అందిస్తూ తారకరత్న హెల్త్ గురించి అప్ డేట్ ఇస్తున్నారు సెలెబ్రిటీస్.

తాజాగా మెగా స్టార్ చిరంజీవి Chiranjeevi కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ట్వీట్ చేశారు. "సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. " అంటూ చిరు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నందమూరి అభిమానులకు శుభ వార్త చెప్పారు.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics