Chiranjeevi ‘s all movies halted due to corona

Wednesday,January 26,2022 - 03:55 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్కొక్కరు కోవిడ్ తో ఎఫెక్ట్ అవుతూ సెల్ఫ్ ఐసోలేషణ్ అవుతున్నారు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ తనని రీసెంట్ గా కలిసిన అందరూ జాగ్రత్తగా ఉండాలని , ఒకసారి వారు కూడా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. అయితే తనకి చాలా మైల్డ్ సింటమ్స్ ఉన్నాయని ఆయన చెప్పుకున్నారు. గతంలో ఒకసారి చిరు కోవిడ్ పాజిటివ్ అంటూ ట్వీట్ చేశారు. కానీ తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ తప్పుగా వచ్చాయని తనకి పాజిటివ్ రాలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం చిరు కి కోవిడ్ రావడంతో ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది. ప్రస్తుతం మెగా స్టార్ హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్', తో పాటు 'భోళా శంకర్' కూడా షూటింగ్ జరుపుకుంటుంది. 'భోలా శంకర్' సెట్ లో చిరు పాల్గొనాల్సి ఉంది. అలాగే వచ్చే వారం నుండి గాడ్ ఫాదర్ షూట్ లో మళ్ళీ జాయిన్ అవ్వాల్సి ఉంది. ఎంత లేదన్నా చిరు పూర్తిగా కోలుకొని భయటికి రావడానికి వారంపైనే పడుతుంది.

దీంతో ఇప్పుడు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ఈ వారం రోజులు చిరు లేని మిగతా నటీ నటులతో సన్నివేశాలు తీయాల్సి ఉంటుంది. ఏదేమైనా టాలీవుడ్ లో ఒక్కొక్కరు కోవిడ్ బారిన పడుతూ షూటింగ్స్ కి బ్రేక్ తీసుకుంటున్నారు. మెగాస్టార్ త్వరలోనే పూర్తిగా కోలుకొని మళ్ళీ షూటింగ్స్ కి ఎటెండ్ అవ్వాలని కోరుకుందాం.