Chiranjeevi Dual Role in Bobby Direction

Monday,July 26,2021 - 05:47 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి ఇకపై జెట్ స్పీడులో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే వరుసగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకొని దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం కొరటాల శివ తో ఆచార్య చేస్తున్న చిరు నెక్స్ట్ మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఆ సినిమా వచ్చే సెట్స్ పైకి వెళ్లనుంది.

అలాగే బాబీ డైరెక్షన్ లో కూడా మెగా స్టార్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చిరు బాబీ మెగా నరేషన్ అయిపొయింది. ప్రస్తుతం మిగతా కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు బాబీ. అయితే ఈ సినిమాలో చిరు రెండు డిఫరెంట్ లుక్స్ తో డ్యుయల్ రోల్ చేయనున్నాడని తెలుస్తుంది. సినిమాలో చిరు తండ్రి కొడుకుల పాత్రలు చేయనున్నాడని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే మెగా స్టార్ నుండి చాలా ఏళ్ళకి ఓ డ్యుయల్ రోల్ సినిమా చూసిన అనుభూతి ఫ్యాన్స్ కి కలుగుతుంది.

చిరు తన కెరీర్ లో చాలానే డ్యుయల్ రోల్ చేశారు. కాకపోతే స్నేహం కోసం ..రిక్షావోడు...సింహపురి సింహం సినిమాల్లో తండ్రి కొడుకులుగా నటించాడు. మెగా స్టార్ చివరి డ్యుయల్ రోల్ 'అందరి వాడు'. ఇందులో కూడా చిరు తండ్రి కొడుకుల పాత్రలో మెప్పించాడు. మరి ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ మెగా స్టార్ డ్యుయల్ రోల్ అంటూ ప్రచారం మొదలవ్వడం .. పైగా తండ్రి కొడుకుల కథ అనే టాక్ రావడంతో ఇటు మెగా ఫ్యాన్స్ లో అటు సినిమా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంటుంది. మరి ఇందులో నిజమెంత అనేది మరికొద్ది రోజులు తెలియనుంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics