Chiranjeevi condolences on the death of singer G Anand

Friday,May 07,2021 - 01:05 by Z_CLU

ప్రముఖ తెలుగు సినీ నేపథ్య గాయకుడు జి. ఆనంద్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన కరోనాతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఆనంద్ తుది శ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితానికి, సింగర్ ఆనంద్‌ కు ప్రత్యేక అనుబంధం ఉంది.

చిరంజీవి సినీప్రస్థానంలో డాన్స్ చేసిన మొదటి పాటను జి.ఆనంద్ పాడారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి బయటపెట్టారు. తన సినీజీవితంలో తొలి పాట పాడిన ఆనంద్ లేని లోటు తీర్చలేనిదన్నారు. చిరంజీవి ట్వీట్ ను యాజ్ ఇటీజ్ గా ఇక్కడ ఇస్తున్నాం.

Singer G anand chiranjeevi zeecinemalu 1

పండంటి కాపురం, అమెరికా అమ్మాయి, దానవీర శూరకర్ణ, మనఊరి పాండవులు, ప్రాణంఖరీదు లాంటి ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు ఆనంద్. గాంధీ నగర్ రెండో వీధి, స్వతంత్రానికి ఊపిరి పోయండి, రంగవల్లి లాంటి సినిమాలకు సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించారు.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics