Chandhoo Mondeti next with Varun Tej ?

Wednesday,August 17,2022 - 01:32 by Z_CLU

'కార్తికేయ 2' తో  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు చందూ మొండేటి నెక్స్ట్ గీతా ఆర్ట్స్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా నిర్మాత అల్లు రవింద్ కూడా చందూ తదుపరి సినిమా మా బేనర్ లోనే అంటూ అఫీషియల్ ప్రకటించేశారు. 'కార్తికేయ 2' సెట్స్ పై ఉండగానే చందూ కి గీతా ఆర్ట్స్ నుండి అడ్వాన్స్ అందింది. అప్పటి నుండి కొన్ని స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తూ ఫైనల్ గా ఓ కథ లాక్ చేసుకున్నాడు. ఇటివలే అల్లు అరవింద్ , బన్నీ వాస్ నుండి ఆ కథక గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది.

ప్రస్తుతం అందిన సమాచారం మేరకూ  వరుణ్ తేజ్ తో ఈ మూవీ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం వరుణ్ ప్రవీణ్ సత్తారు తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే చందూ మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ లో వరుణ్ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి గీతా ఆర్ట్స్ నుండి ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.  త్వరలోనే దీని పై అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics