Catherine Tresa fixed for Raviteja in Mega154 ?

Monday,March 28,2022 - 05:18 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న Mega 154 సినిమాకు సంబంధించి తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమాలో మెగాస్టార్ తో కలిసి రవితేజ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. మేకర్స్ నుండి ఇంకా అఫీషియల్ గా రాలేదు కానీ రవితేజ స్పెషల్ రోల్ చేయడం పక్కా అంటూ టాక్ వినబడుతుంది. అయితే ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ కూడా ఉంటుందని అంటున్నారు. ఆ రోల్ కి ఇటివలే కేథరిన్ ని తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కేథరిన్ 'భళా తందనాన' , 'బింబిసార', మాచర్ల నియోజిక వర్గం' సినిమాల్లో నటిస్తుంది. వాటితో పాటు మెగా ప్రాజెక్ట్ కూడా సైన్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో షెడ్యుల్ జరుగుతుంది. త్వరలోనే రవితేజ కూడా షూట్ లో జాయిన్ అవ్వనున్నాడని తెలుస్తుంది.

త్వరలోనే ఈ సినిమాలో రవితేజ నటిస్తున్న సంగతి చెప్పి స్పెషల్ గా వెల్కం చెప్పే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. మరి రవితేజ ఎనౌన్స్ మెంట్ అయిన వెంటనే కేథరిన్ కి వెల్కం చెప్తూ ఆ విషయాన్ని కూడా చెప్పేస్తారేమో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ బేనర్స్ నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. చిరు మాస్ గెటప్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేసే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics