Bullet Rally for Bangarraju World Television Premiere

Thursday,March 24,2022 - 07:47 by Z_CLU

ప్రమోషన్ లో తనకంటూ ఓ కొత్త రూట్ క్రియేట్ చేసుకుంది జీ తెలుగు. కంటెంట్ ను ఆడియన్స్ వరకు తీసుకెళ్లడంతో సూపర్ సక్సెస్ అవుతుంది. ఛానెల్ అనుసరిస్తున్న వినూత్న పోకడలు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకొచ్చింది Zee Telugu. బంగార్రాజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం ఏకంగా బైక్ బుల్లెట్ ర్యాలీ నిర్వహించింది.

Bangarraju లో హీరోలు నాగార్జున, నాగచైతన్య బుల్లెట్ వాడుతారు. మరి అలాంటి బుల్లెట్స్ తో ఏకంగా ర్యాలీ చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి గ్రాండ్ విజువల్ ను కళ్లముందుకు తీసుకొచ్చింది జీ తెలుగు. భీమవరం బంగార్రాజులతో బుల్లెట్ ర్యాలీ నిర్వహించింది. బంగార్రాజు గెటప్స్ లో, బ్లాక్ కలర్ బుల్లెట్స్ తో భీమవరం కుర్రాళ్లు రచ్చ రచ్చ చేశారు.

https://www.instagram.com/p/CbhgbfdFPN-/

ఈ సందర్భంగా బుల్లెట్స్ తో నాగ్ అనే అక్షరాలతో ఏర్పాటుచేసిన ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతున్న బంగార్రాజు కోసం ఇలా డిఫరెంట్ గా ప్రమోట్ చేయడం ఇదే తొలిసారి.

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కింది బంగార్రాజు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత zee5లో కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడు జీ తెలుగు ప్రేక్షకుల కోసం రాబోతోంది. మార్చి 27 ఆదివారం, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి జీ తెలుగులో బంగార్రాజు సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics