Bobby to direct Balayya , Nbk109 announcement details

Monday,June 05,2023 - 02:49 by Z_CLU

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య లైనప్ లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఉంది. 'వాల్తేరు వీరయ్య' తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ తాజాగా బాలయ్య కోసం ఓ పొలిటికల్ సబ్జెక్ట్ రాసుకొని ఫైనల్ చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ ఘాట్ మొదలు కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

వచ్చే ఏడాది ఎలెక్షన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ మూవీ ప్లాన్ చేసుకుంటున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను బాలయ్య పుట్టిన రోజు నాడు ఆఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. అయితే అదే రోజు టైటిల్ చెప్తారా ? లేదా కేవలం ఎనౌన్స్ మెంట్ మాత్రమే ఉంటుందా ? చూడాలి.