Mahesh-Anil_Ravipudi – Blockbuster combo repeats?

Tuesday,December 01,2020 - 12:12 by Z_CLU

కొన్ని బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ లో మళ్ళీ సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఒకసారి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో -దర్శకుడు కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు కలిసి వర్క్ చేస్తామా అని చూస్తుంటారు. ఇప్పుడు అలంటి కాంబోనే మరోసారి సెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు Mahesh Babu-Anil Ravipudi. ఈ కాంబో మరో సినిమా కోసం కలుస్తున్నారనే టాక్ వినబడుతుంది. తాజాగా మహేష్ కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసిన స్క్రిప్ట్ ను వినిపించాడట అనిల్.

ప్రస్తుతం పరశురాంతో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న సూపర్ స్టార్ నెక్స్ట్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మహేష్ ఓ సినిమా చేయాల్సి ఉంది. వీటి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ రెండో సినిమా చేసే చాన్స్ కనిపిస్తుంది. అనిల్ రావిపూడి ప్రస్తుతం F3 తో పాటు ఓ ఫీమేక్ సెంట్రిక్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. మహేష్ నుండి కాల్ వచ్చే లోపు ఈ రెండు సినిమాలు ఫినిష్ చేస్తాడు అనిల్.