Bimbisara released Worldwide

Friday,August 05,2022 - 07:08 by Z_CLU

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ బింబిసార. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది. ఎప్పట్లానే ఫస్ట్ రిపోర్ట్ ఓవర్సీస్ నుంచి వచ్చింది. ఓవర్సీస్ లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

ఇక తెలుగు స్టేట్స్ విషయానికొస్తే, రిలీజ్ కు ముందే బింబిసార ఓ పాజిటివ్ సైన్ ఇచ్చింది. అదేంటంటే, ఈమధ్య కాలంలో ఈ సినిమాకు జరిగినంత బాగా అడ్వాన్స్ బుకింగ్స్, మరే సినిమాకు జరగలేదు. అలా బింబిసారపై తమకున్న ఇంట్రెస్ట్ ను అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా చూపించారు ప్రేక్షకులు.

కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా తెరకెక్కింది బింబిసార సినిమా. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో, అప్పట్నుంచి సినిమాపై అందరూ అంచనాలు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అప్పట్నుంచి ప్రతిరోజూ అంచనాలు పెంచుతూ, ఫైనల్ గా ఈ రోజు గ్రాండ్ గా థియేటర్లలోకి అడుగుపెట్టాడు బింబిసారుడు.

ఈమధ్యకాలంలో టైమ్ ట్రావెల్ ఫాంటసీ మూవీ తెలుగులో రాలేదు. ఆ లోటును బింబిసార తీర్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా కావడం, టికెట్ రేట్లు అందుబాటులో ఉండడంతో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది.

సంయుక్త మీనన్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన బంబిసార సినిమాతో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.