Bimbisara Day-1 Collections

Saturday,August 06,2022 - 03:19 by Z_CLU

విడుదలైన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది బింబిసార సినిమా. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే బుకింగ్స్ కూడా జోరుగా సాగడంతో, బింబిసార సినిమా మొదటి రోజు మంచి వసూళ్లు సాధించింది.

బింబిసార సినిమాకు ఏపీ,నైజాంలో మొదటి రోజు 6 కోట్ల 27 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను దాదాపు 13 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే, మొదటి రోజే బింబిసార సగం బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది.

ప్రస్తుతం వినిపిస్తున్న పాజిటివ్ టాక్ తో ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోవడం గ్యారెంటీ అంటోంది ట్రేడ్. తెలుగు రాష్ట్రాల్లో బింబిసార సినిమాకు వచ్చిన మొదటి రోజు షేర్లు ఇలా ఉన్నాయి.

Nizam 2.12CR (Including GST) Ceded 1.30 Vizag 0.90 (Including GST) East 0.43 West 0.36 Krishna 0.34 Guntur 0.57 Nellore 0.26