Big OTT offer to Samantha

Monday,June 14,2021 - 12:19 by Z_CLU

ఇప్పటికే ఓటీటీలో అడుగుపెట్టింది సమంత. ఆమె డెబ్యూకు మంచి అప్లాజ్ కూడా వచ్చింది. దీంతో ఆమెను వెబ్ సిరీస్ లోకి, ఒరిజినల్ మూవీస్ లోకి తీసుకునేందుకు ఇప్పుడు చాలా సంస్థలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా సమంతకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది ఓ ఓటీటీ ఛానెల్.

samantha new stills zeecinemalu

తమ ఫ్లాట్ ఫామ్ పై ఓ వెబ్ సిరీస్ చేయాల్సిందిగా సమంతను కోరింది సదరు ఓటీటీ సంస్థ. కంటెంట్ తో పాటు దర్శకుడ్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా ఆమెకే కల్పించింది. ఒకవేళ ఈ ప్రపోజల్ ఇష్టం లేదనుకుంటే కంపెనీనే కంటెంట్ సమకూర్చిపెడుతుందట.

[caption id="attachment_185633" align="alignnone" width="640"]samantha-akkineni-new-stills                                    సమంత[/caption]

మరోవైపు పారితోషికం విషయంలో కూడా సమంతకు, ఆ సంస్థ బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తన డెబ్యూ ఓటీటీకి సమంత 4 కోట్ల రూపాయలు తీసుకుందనే టాక్ ఉంది. ఈసారి అంతకంటే కాస్త ఎక్కువ మొత్తాన్నే ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

samantha-new-stills

అయితే ప్రస్తుతానికి సమంత ఈ ఆఫర్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే, ఆమె ఓటీటీలో ప్రయోగాలు చేయాలనుకుంటోంది. నటిగా తననుతాను నిరూపించుకునే ఛాలెంజింగ్ పాత్రలు పోషించాలనుకుంటోంది. అలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు ఈ డీల్ సెట్ అవుతుంది. ప్రస్తుతం ఆమె కొన్ని ఓటీటీ కథలు వినే పనిలో బిజీగా ఉంది.

[caption id="attachment_184777" align="alignnone" width="640"]samantha-new-stills                         సమంత అక్కినేని[/caption]

సమంత చేతిలో శాకుంతలం ప్రాజెక్టు ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతున్నాయి. శాకుంతలం కూడా స్టార్ట్ అయ్యేలా ఉంది. అదే కనుక జరిగితే సమంత, మళ్లీ ఓటీటీలో కనిపించడానికి కాస్త టైమ్ పట్టొచ్చు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics