Bellamkonda Srinivas to romance with Ananya Pandey in Chatrapathi Remake ?

Friday,February 19,2021 - 06:14 by Z_CLU

ఈ ఏడాది సంక్రాంతికి 'అల్లుడు అదుర్స్' అంటూ వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.VV వినాయక్ డైరెక్షన్ లో 'ఛత్రపతి' రీమేక్ చేయబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే తన బాలీవుడ్ డెబ్యూ కోసం హిందీ నేర్చుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మరో నెలరోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. లేటెస్ట్ గా సినిమాలో శ్రీనివాస్ హీరోయిన్ గా అనన్య పాండే ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పూరి -విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న 'లైగర్' తో టాలీవుడ్ కి పరిచయం అవ్వబోతుంది అనన్య. ప్రస్తుతం తెలుగులో అదొక్క సినిమానే చేస్తోంది. ఆ సినిమా తర్వాత ఆమె సైన్ చేసిన సినిమా బెల్లంకొండ దెనని అంటున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతి లాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మిగతా క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.