Bellamkonda Srinivas in an interesting remake

Thursday,April 29,2021 - 05:13 by Z_CLU

హీరోగా వరుసగా సినిమాలు చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా మినహా మిగతా సినిమాలు అతనికి సక్సెస్ అందించలేకపోయాయి. అయితే కెరీర్ డౌన్ అవుతున్న టైంలో రాక్షసుడు అనే రీమేక్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు శ్రీనివాస్. రాక్షసన్ అనే తమిళ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. అందుకే బెల్లంకొండ తాజాగా మరో తమిళ్ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.

అవును... తమిళ్ ధనుష్ నటించిన 'కర్ణన్' సినిమాను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట బెల్లంకొండ.

alludu-adhurs-movie-january-15-release

తాజాగా ఈ సినిమాకు సంబంధించి తెలుగు రీమేక్ రైట్స్ ను సాయి శ్రీనివాస్ తండ్రి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొనుగోలు చేశాడని సమాచారం. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో 'ఛత్రపతి' రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా పూర్తయ్యాక తమిళ్ రీమేక్ సినిమాను మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నాడట శ్రీనివాస్.

bellamkonda bollywood debut chatrapathi remake

మే 9న విడుదలైన ధనుష్ కర్ణన్ మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన అందరూ మెచ్చుకున్నారు. త్వరలో సినిమా ఓటీటీ లో విడుదల కానుంది. ఆ తర్వాత ఇంకా రెస్పాన్స్ అందుకుంటుంది. అందుకే ఈలోపు రైట్స్ కొనుగోలు చేసి తెలుగులో రీమేక్ ప్లాన్ చేస్తున్నారట నిర్మాత బెల్లంకొండ సురేష్.

bellamkonda zeecinemalu

వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా మరో రిమేక్ కానుంది. అటు ఛత్రపతి ఇటు కర్ణన్ రీమేక్స్ తో ఈ యంగ్ హీరో ఎలాంటి హిట్ అందుకుంటాడు ? సేమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడా ? అనే డౌట్స్ అందరిలో ఉన్నాయి. మరి ఆ ప్రశ్నలను దాటి ఈ రీమేక్స్ తో శ్రీనివాస్ హిట్స్ సాధిస్తే యంగ్ రీమేక్ హీరో అనే బిరుదు అందుకోవడం ఖాయం.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics