Balayya coming up with another Faction Action film

Thursday,June 30,2022 - 03:40 by Z_CLU

బాలయ్య నుండి కంప్లీట్ ఫ్యాక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చి చాన్నాళ్ళవుతోంది. ఫ్యాక్షన్ కథా సినిమాలతో బాలయ్య ఇండస్ట్రీ హిట్లు కొట్టి భారీ విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బాలయ్య కంప్లీట్ ఫ్యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. అవును గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న జై బాలయ్య (వర్కింగ్ టైటిల్) సినిమా  ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామాగానే ఉండబోతుందట.

ఫ్యాక్షన్ సినిమా అనగానే పగ , ప్రతీకారాలు , సిస్టర్ సెంటిమెంట్ , హీరో పిల్లల్ని ఎవరికీ తెలియకుండా విదేశాల్లో పెంచడం ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు బాలయ్య -గోపీచంద్ సినిమాలో కూడా అవే కథా వస్తువులుగా ఉండనున్నాయట. సినిమాలో బాలయ్య కు చెల్లిలి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. ఇద్దరి మధ్య సిస్టర్ సెంటిమెంట్ డ్రామా ఉంటుందట.  అలాగే ఇందులో బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్రను ఇప్పటికే పరిచయం చేశారు. రెండో లుక్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

సినిమా ఫస్ట్ హాఫ్ లోనే ఓ మూడు భారీ ఫైట్లు ఉంటాయని తెలుస్తుంది. అందులో ఒక ఫైట్ విదేశాల్లో భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారట. బాలయ్య ఒకప్పటి 'చెన్న కేశవరెడ్డి' స్టైల్ లో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. కాకపోతే గోపీచంద్ మార్క్ యాక్షన్ తో ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ అందిస్తుందట. బాలయ్య కేరెక్టర్ , పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కలిసి మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందేలా సినిమాను రెడీ చేస్తున్నాడట గోపీచంద్ మలినేని. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics