Balakrishna’s new movie starts from May !

Wednesday,February 03,2021 - 04:32 by Z_CLU

'క్రాక్' తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని నెక్స్ట్ బాలయ్య తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం  స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా మే నెల నుండి షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తుంది. త్వరలోనే సినిమాను ఎనౌన్స్ చేసి కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ కూడా తెలియజేయనున్నారని సమాచారం.

బాలయ్య కోసం పక్కా మాస్ యాక్షన్ కథను సిద్దం చేసి దానికి తుదిమెరుగులు దిద్దుతున్నాడట గోపీచంద్. 'క్రాక్' లో యాక్షన్ ఎపిసోడ్స్ టైప్ లో ఇందులో కూడా మాస్ కి పూనకాలు తెప్పించే ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. ఈ కాంబో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ద్వారా రవి , నవీన్ నిర్మించన్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీనుతో చేస్తున్న సినిమా షూటింగ్ బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ కల్లా ఆ సినిమాను ఫినిష్ చేసి గోపీచంద్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.