Balakrishna’s Akhanda to release on October 13

Tuesday,August 31,2021 - 12:08 by Z_CLU

నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న 'అఖండ' రిలీజ్ కి రెడీ అవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను మే 28 న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆగస్ట్ లో మరో డేట్ అనుకున్నారు కానీ షూటింగ్ పూర్తి కానందున మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు దసరా బరిలో సినిమాను నిలిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

విజయదసమి స్పెషల్ గా అక్టోబర్ 13న సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఈ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. అక్టోబర్ 8న వైష్ణవ్ తేజ్ 'కొండపొలం', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రిలీజ్ అవ్వనున్న సంగతి తెలిసిందే. అలాగే అక్టోబర్ 14న శర్వానంద్ , సిద్దార్థ్ నటిస్తున్న 'మహా సముద్రం' రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఇక అక్టోబర్ 15న దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ మొదటి సినిమా 'రౌడీ బాయ్స్'రిలీజ్ అవ్వనుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

ఒక వేళ 'అఖండ' అక్టోబర్ 13న విడుదలైతే 'మహా సముద్రం' వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అఖండ కి సంబంధించి టాకీ పూర్తయింది. ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ చివరి వారం వరకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసి అక్టోబర్ మొదటి వారం కల్లా ఫస్ట్ కాపీ సిద్దం చేసే పనిలో ఉన్నారు బోయపాటి అండ్ టీం. మరి మేకర్స్ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics