Balakrishna KalyanRam Multi Starrer in Anil Ravipudi Direction

Tuesday,May 04,2021 - 03:24 by Z_CLU

 

నందమూరి మల్టీ స్టారర్ రానుందా ? బాలయ్య తో కళ్యాణ్ రామ్ సినిమా చేస్తున్నాడా ? అనే ప్రశ్నలకు నిజమనే సమాధానం వస్తుంది. బాలయ్య , కళ్యాణ్ రామ్ కాంబోలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతుందట. అనిల్ రావిపూడి ఈ మల్టీ స్టారర్ సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. గతంలో బాలకృష్ణ కి 'రామారావు గారు' అనే స్క్రిప్ట్ చెప్పాడు అనిల్. ఎందుకో ఆ సినిమా సెట్ అవ్వలేదు. ఆ తర్వాత అనిల్ వరుస సినిమాలతో డైరెక్టర్ గా బిజీ అయిపోయాడు. బాలయ్య కూడా లైన్లో ఉన్న డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అయితే మళ్ళీ ఈ కాంబో సినిమా సెట్ అవ్వబోతుందని టాక్..

లేటెస్ట్ గా బాలకృష్ణ కి మరో కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట అనిల్ రావిపూడి. ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ని కళ్యాణ్ రామ్ తో చేయించాలని భావిస్తున్నాడట. ఈ విషయం బాలయ్యతో కూడా చెప్పాడట. క్యారెక్టర్ విన్న వెంటనే కళ్యాణ్ రామ్ ఓకె చెప్పేశాడట. బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్-కథానాయకుడు', 'ఎన్టీఆర్-మహానాయకుడు' సినిమాలో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాకపోతే ఈసారి ఈ ఇద్దరి కాంబోలో కంప్లీట్ యాక్షన్ సినిమా రానుందట.

balakrishna kalyanram multi starrer zeecinemalu

F2 లో వెంకటేష్, వరుణ్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన అనిల్ రావిపూడి ఈసారి బాలకిష్ణ , కళ్యాణ్ రామ్ క్యారెక్టర్స్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి. ప్రస్తుతం F2 సినిమాకు సీక్వెల్ గా F3 తీస్తున్న అనిల్ రావిపూడి.... బాలయ్య సినిమాకు స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

ఇక బోయపాటి డైరెక్షన్ లో 'అఖండ' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య నెక్స్ట్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయబోతున్నాడు. ఇటు బాలయ్య అటు అనిల్ రావిపూడి ఫ్రీ అవ్వగానే ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బేనర్ పై సాహు గారిపాటి , హరీష్ పెద్ది నిర్మించనున్నారని టాక్.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics