Balakrishna Boyapati Movie New Schedule started

Thursday,October 29,2020 - 12:09 by Z_CLU

లాక్ డౌన్ కంటే ముందే ఒక షెడ్యుల్ పూర్తి చేసుకున్న బాలయ్య , బోయపాటిల BB3 ప్రాజెక్టు ఈరోజు నుండి మళ్ళీ షూటింగ్ మోడ్ లోకి ఎంటరైంది. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమాకు సంబంధించి ఇవాళ్టి నుండి రామోజీ ఫిలింసిటీలో భారీ షెడ్యుల్ ప్లాన్ చేసారు. ప్రస్తుతం హీరో Balakrishna - హీరోయిన్ Prayaga Martin లపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు.

ఎక్కువ బ్రేకులు తీసుకోకుండా షూట్ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. Dwaraka Creations బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు Thaman మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలయ్య -బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమాగా రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.

Also Read - ఫన్ డైరక్టర్ తో బాలయ్య