Balakrishna Birthday – ZeeCinemalu Special

Thursday,June 10,2021 - 03:27 by Z_CLU

నందమూరి నటసింహం ఈ పేరు వినగానే అభిమానులకి పూనకం వచ్చేస్తుంది. తన సినిమాలతో ఫ్యాన్స్ లో ఆ వైబ్రేషన్ క్రియేట్ చేశాడు బాలయ్య. ఇవ్వాళ నందమూరి నటసింహం బాలకృష్ణ 61వ జన్మదినం. ఈ సందర్భంగా 45 ఏళ్ల బాలయ్య కెరీర్ పై ఓ లుక్కేద్దాం.

[caption id="attachment_190764" align="alignnone" width="481"]balakrishna tatamma kala zeecinemalu తాతమ్మ కల సినిమాలో బాలకృష్ణ[/caption]

నందమూరి బాలకృష్ణ నటించిన తొలి చిత్రం తాతమ్మకల. ఈ సినిమతో నటుడిగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, తండ్రితో కలిసి ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్నాడు బాలయ్య.

[caption id="attachment_190763" align="alignnone" width="234"]balakrishna apurva sahodarulu zeecinemalu అపూర్వ సహోదరులు పోస్టర్[/caption]

బాలయ్య తొలి ద్విపాత్రాభినయం చేసిన సినిమా అపూర్వ సహోదరులు. 1986 లో అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకుడు.

 

బాలకృష్ణ నటించిన మొదటి స్కోప్ సినిమా శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామీ చరిత్ర. ఈ సినిమాలో ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారిగా నటించగా ఆయన శిష్యుడు సిద్దయ్య పాత్రలో బాలయ్య కనిపిస్తాడు.

[caption id="attachment_190765" align="alignnone" width="427"]Balakrishna Sri Krishnarjuna Vijayam zeecinemalu శ్రీ కృష్ణార్జున విజయంలో కృష్ణుడిగా బాలకృష్ణ[/caption]

తొలిసారి దాన వీర శూర కర్ణ సినిమాలో తండ్రితో కలిసి పౌరాణిక సినిమా చేశాడు బాలయ్య. హీరోగా బాలకృష్ణ చేసిన తొలి పౌరాణిక చిత్రం శ్రీ కృష్ణార్జున విజయం. అలాగే అక్బర్ సలీమ్ అనర్కాలి అనే టైటిల్ తో మొదటి చారిత్రాత్మక సినిమా చేశాడు.

[caption id="attachment_190766" align="alignnone" width="467"]balakrishna Mangamma gari manavadu zeecinemalu మంగమ్మ గారి మనవడు 100 రోజుల పోస్టర్[/caption]

బాలకృష్ణ నటించింది సినిమాల్లో మొదటి శతదినోత్సవం జరుపుకున్న సినిమా మంగమ్మ వారి మనవడు. ఈ సినిమా ఆబాల గోపాలాన్ని అలరించి మంచి విజయం అందుకొని బాలకృష్ణ కి స్టార్ ఇమేజ్ అందించింది. ఇక బాలయ్య కి తొలి రజతోత్సవ, స్వర్ణోత్సవ సినిమా కూడా ఇదే.

[caption id="attachment_190767" align="alignnone" width="422"]balakrishna ANR లెజెండ్ అక్కినేనితో బాలయ్య[/caption] [caption id="attachment_190768" align="alignnone" width="1080"]balakrishna bhairava dweepam zeecinemalu భైరవద్వీపం వర్కింగ్ స్టిల్[/caption]

బాలకృష్ణ నటించిన తొలి జానపద సినిమా 'భైరవ ద్వీపం. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. ఆయన దర్శకత్వంలోనే తొలి సైన్స్ ఫిక్క్షన్ కథతో 'ఆదిత్య 369' సినిమా కూడా చేశాడు బాలయ్య.

అక్కినేని నాగేశ్వరావు గారితో బాలకృష్ణ నటించిన మొదటి సినిమా భార్య భర్తల బంధం

ఇక బాలకృష్ణ నటించిన తొలి నవలా ఆధార చిత్రం 'భార్గవ రాముడు'. అన్నదమ్ములు హరికృష్ణ-బాలకృష్ణ కలిసి నటించిన మొదటి సినిమా రామ్ రహీం.

balakrishna muddula mamayya zeecinemalu balakrishna narasimhanaidu zeecinemalu balakrishna samarasimha reddy zeecinemalu ఇక బాలకృష్ణ 'ముద్దుల మావయ్య', సమరసింహా రెడ్డి,' నరసింహ నాయుడు' సినిమాలతో మూడు ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. ఒకసారి tollywood ఇండస్ట్రీ హిట్స్ లిస్టు చూస్తే అందులో బాలయ్య నటించిన ఈ మూడు సినిమాలుంటాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రెండు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఘనత బాలయ్య దే. సమర సింహా రెడ్డి , నరసింహా నాయుడు సినిమాల్లో మాస్ అలరించే సన్నివేశాలతో ప్రేక్షకుల రోమాలు నిక్కపోడిచేలా చేశాడు బాలయ్య. ముద్దుల మావయ్య 53 థియేటర్స్ లో, సమరసింహా రెడ్డి 73 కేంద్రాల్లో , నరసింహా నాయుడు 105 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.

[caption id="attachment_188141" align="alignnone" width="500"]akhanda movie balakrishna 2 అఖండలో అఘోరాగా బాలయ్య[/caption]

ఆ భారీ విజయాల తర్వాత కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి విజయాలు అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత వరుస అపజయాలు అందుకున్నారు. ఇక సింహా సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ అందుకొని IAM BACK అని గర్జించాడు నట సింహం. మరోసారి బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించి 'లెజెండ్' తో మళ్ళీ రికార్డులు సృష్టించి మరో పదేళ్ళ పాటు తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. రికార్డులు తిరగరాసే కమర్షియల్ సినిమాలే కాదు పౌరాణికాలు , జానపదాలు , చారిత్రాత్మక సినిమాలతో కూడా నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగాడు బాలయ్య. త్వరలో అఖండ తో ప్రేక్షకుల ముందుకు రానున్న నందమూరి నట సింహం ఆ సినిమాతో అఖండ విజయం అందుకోవాలని ఆశిస్తూ బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది జీ సినిమాలు.

  • Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics