Balakrishna Appreciated Blockbuster Bimbisara Movie
Sunday,August 14,2022 - 03:32 by Z_CLU
కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బింబిసార. సోసియో-ఫాంటసీ కథతో తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో కొనసాగుతూ, ఆడియన్స్ నీరాజనాలు అందుకుంటోంది.
ఇప్పుడీ సినిమాకు మరో ప్రముఖ వ్యక్తి ప్రశంసలు కూడా దక్కాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ, బింబిసార సినిమాను ప్రత్యేకంగా చూశారు. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా మొత్తం చూసిన బాలయ్య, కల్యాణ్ రామ్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. తొలి సినిమాకే మంచి దర్శకత్వ ప్రతిభ కనబరిచిన వశిష్టను అభినందించారు.
స్వయంగా బాలయ్య మెచ్చుకోవడంతో, బింబిసార యూనిట్ ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఓవైపు భారీగా వస్తున్న కలెక్షన్లకు తోడు, ఇప్పుడు బాలయ్య ప్రశంసలు కూడా దక్కడంతో యూనిట్ అంతా గాల్లో తేలిపోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్స్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.