Action King Arjun is playing the villain role in RaviTeja’s Khiladi movie

Wednesday,December 02,2020 - 12:11 by Z_CLU

ప్రస్తుతం క్రాక్ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసిన మాస్ మహారాజా Raviteja నెక్స్ట్ రమేష్ వర్మ దర్శకత్వంలో Khiladi సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నాడట యాక్షన్ కింగ్ అర్జున్. తాజాగా అర్జున్ ని కలిసి స్క్రిప్ట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట దర్శకుడు. అర్జున్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.

'నా పేరు సూర్య'లో అల్లు అర్జున్ తండ్రిగా నటించిన అర్జున్ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అంతకంటే ముందు Nithin Lie సినిమాలో విలన్ గా మెప్పించాడు. మినిమం గ్యాప్స్ లో డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఖిలాడీ సినిమాలో విలన్ రోల్ తో మళ్లీ స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు.

Arjun_in_Raviteja_Khiladi_movie

కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అను ఇమ్మానుయెల్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మారుతి, త్రినాధరావు నక్కిన సినిమాలు చేయనున్నాడు రవితేజ.

Also Check - ఖిలాడీలో స్టార్ యాంకర్