Anushka Shetty fixed for Megastar’s up coming film ?

Wednesday,January 12,2022 - 07:49 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తూ ఆ సినిమాల షూటింగ్స్ తో బిజీ ఉంటున్న మెగాస్టార్ ఇటివలే మరో మెగా ప్రాజెక్ట్ ని కూడా ఎనౌన్స్ చేశాడు. ఈసారి యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు చిరు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో డి.వి.వి.దానయ్య నిర్మాతగా చిరు ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. 'ఛలో' , 'భీష్మ' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల చిరు కోసం ఓ అదిరిపోయే కమర్షియల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.

ఈ మధ్యే స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని సమాచారం. వెంకీ చెప్పిన పాయింట్ మెగాస్టార్ కి బాగా కనెక్ట్ అయిందని ఇన్సైడ్ టాక్. అందుకే కేవలం రెండు సినిమాలు తీసిన దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేయబోతున్నారు. మెగా స్టార్ ని మెగా అభిమాని వెంకీ ఎలా ప్రెజెంట్ చేస్తాడా ? అనే చర్చ నడుస్తుంది. అయితే ఈ సినిమాకు హీరోయిన్ సెలెక్షన్స్ కూడా స్టార్ట్ అయిందని తెలుస్తుంది.

చిరు సరసన అనుష్క శెట్టి ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. నిజానికి వెంకీ కదుముల డైరెక్ట్ చేసిన రెండు సినిమాల్లో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈసారి కూడా ఆమెనే వెంకీ రిపీట్ చేస్తాడనే టాక్ వినిపించింది. కానీ చిరు సరసన రష్మిక సూట్ అవ్వదని భావించి సీనియర్ హీరోయిన్స్ ని ఫిల్టర్ చేస్తున్నారట. ఆల్మోస్ట్ అనుష్క ని ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics