Anushka in Prabhas’s Adipurush?

Saturday,September 12,2020 - 12:23 by Z_CLU

Baahubali ప్రాంచైజీతో క్రేజీ కాంబో అనిపించుకున్న Prabhas-Anushka మరో సినిమా చేయబోతున్నారనే ప్రచారం ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుంది. అవును Prabhas21 గా తెరకెక్కనున్న 'Adipurush' సినిమాలో అనుష్క ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఫ్యాన్స్ ఈ కాంబోలో మరో సినిమా అంటూ పోస్టులు పెడుతున్నారు.

జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది ఆదిపురుష్. Prabhas రాముడిగా కనిపించనున్న ఈ సినిమాలో రావణుడిగా Saif Ali Khan కనిపించబోతున్నాడు. అయితే సినిమాలో మరో కీలక పాత్ర సీత క్యారెక్టర్ లో ఏ హీరోయిన్ కనిపించనుందనేది హాట్ టాపిక్ అవుతుంది.

ఇప్పటికే ఈ Keerthy Suresh , Kiara Advani పేర్లు వినిపించగా తాజాగా స్వీటీ అనుష్క పేరు తెరపైకి వచ్చింది. స్వీటీ హీరోయిన్ గా ఫిక్స్ అయితే బాహుబలి కాంబో అంటూ వరల్డ్ వైడ్ గా సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.