Anupama Parameswaran reacts on her Marriage

Saturday,December 19,2020 - 02:03 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో చాలామంది హీరోహీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. దీంతో సహజంగానే మిగతా హీరోహీరోయిన్లకు మీడియా నుంచి పెళ్లి క్వశ్చన్లు ఎక్కువయ్యాయి. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కు కూడా ఈ క్వశ్చన్ ఎదురైంది.

హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన అనుపమ, తన పెళ్లిపై రియాక్ట్ అయింది. తనకింకా పాతికేళ్లు మాత్రమేనని, కాబట్టి Marriage కి ఇంకా చాలా టైమ్ ఉందని అంటోంది ఈ మలయాళీ బ్యూటీ.

లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఈ చిన్నది.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం తెలుగులో 3 సినిమాలు చేస్తోంది అనుపమ పరమేశ్వరన్.

నిఖిల్ తో 18-Pages అనే సినిమా సెట్స్ పై ఉంది. దీంతో పాటు దిల్ రాజు బ్యానర్ లో రౌడీబాయ్స్ అనే సినిమా చేస్తోంది. ఇక మరో సినిమాను దిల్ రాజు-పీవీపీ కలిసి నిర్మిస్తున్నారు. మలయాళంలో హిట్టయిన హెలెన్ సినిమాకు రీమేక్ అది.

Also Check - స్లిమ్ గా మారిన అనుపమ-ఏంటి రీజన్?