Anupama Parameswaran New Slim Look

Tuesday,October 20,2020 - 02:12 by Z_CLU

టాలీవుడ్ లో కొందరు హీరోయిన్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. ఆ లిస్టులో మలయాళ బ్యూటీ Anupama Parameswaran కూడా ఉంది. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ఈ ముద్దుగుమ్మ అందానికి మొదటి సినిమాతోనే ఫిదా అయ్యారు ఆడియన్స్. బొద్దుగా ముద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. సడెన్ గా స్లిమ్ గా తయారై తన న్యూ లుక్ తో ఫ్యాన్స్ ఆశ్చర్య పోయేలా చేసింది.

తెలుగులో నిఖిల్ తో తదుపరి సినిమా చేస్తున్న అనుపమ ఈరోజు 18Pages సెట్ లో అడుగుపెట్టింది. దీంతో మేకర్స్ నిఖిల్ , అనుపమతో ఓ వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసారు. ఇందులో అనుపమ స్లిమ్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

లాక్ డౌన్ లో ఈ బొద్దుగుమ్మ ఇంత చిక్కిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పల్చటి అందంతో అనుపమ ఈ సినిమాలో ఎలా ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.