Anupama Parameswaran Chit Chat with fans

Wednesday,April 07,2021 - 03:43 by Z_CLU

ఉన్నట్టుండి సడెన్ గా సోషల్ మీడియాలో లైవ్ లోకొచ్చింది బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. బోర్ కొడుతోందని చెబుతూనే, కాస్త క్రేజీగా ఉండే ప్రశ్నలు అడగండి సమాధానం చెబుతానంటూ ఊహించింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మకు ఎదురైన ప్రశ్నలేంటి.. దానికి ఆమె సమాధానాలేంటి?

- కాసేపు పడుకోవచ్చు కదా? నేను పడుకుంటే నా కోసం ఎవరు పనిచేస్తారు?

- నీ వయసెంత? 25 ఏళ్లు

- బ్యూటీ సీక్రెట్ ఏంటి? నిత్యం నవ్వుతూ ఉంటాను.

- ఇలా బోర్ కొడితే ఏం చేస్తావ్? జనరల్ గా బోర్ కొడితే పెయింటింగ్స్ వేస్తాను. ఇప్పటివరకు చాలా పెయింటింగ్స్ వేశాను

- వరల్డ్ లో మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? ఎప్పుడైనా నా ఫేవరెట్ స్పాట్ నా ఇల్లు. ఇంట్లో ఏం చేయకుండా అలా కూర్చున్నా చాలు.

- బొద్దుగా ఉంటేనే బాగుంటావ్, ఎందుకు సన్నబడ్డావ్? నిజమే నాక్కూడా అదే అనిపిస్తోంది. అయినా ఇప్పుడిప్పుడే మళ్లీ కాస్త బొద్దుగా మారుతున్నాను. డోంట్ వర్రీ.

- ఇష్టమైన భోజనం ఇష్టమైన భోజనం బిర్యానీ, మరీ ముఖ్యంగా చికెన్ బిర్యానీ. రెగ్యులర్ గా అయితే రైస్, టమాట పప్పు ఎక్కువగా తింటాను.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics