Anupama Parameswaran buzy with three telugu films right now !

Saturday,April 03,2021 - 10:01 by Z_CLU

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అవును ప్రస్తుతం మల్లూ బ్యూటీ చేతిలో మూడు సినిమాలున్నాయి. నిఖిల్ తో '18 పేజెస్' సినిమాతో పాటు 'కార్తికేయ 2' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అనుపమ. ఈ రెండు సినిమాలు కాక నిర్మాత శిరీష్ తనయుడు హీరోగా పరిచయమవుతున్న 'రౌడీ బాయ్స్' లో కూడా నటిస్తుంది. ఈ మూడు సినిమాలు ప్రెజెంట్ సెట్స్ పై ఉన్నాయి. ఇటివలే 'కార్తికేయ 2' మొదటి షెడ్యుల్ లో పాల్గొన్న ఈ బ్యూటీ ప్రస్తుతం రౌడీ బాయ్స్ షూటింగ్ కి హాజరవుతుంది. త్వరలోనే మొదలవ్వనున్న '18 పేజెస్' మరో షెడ్యుల్ లో జాయిన్ అవ్వనుంది.

ఇలా ఒకే సారి మూడు సినిమాలతో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది అనుపమ. ఈ సినిమాలు పూర్తయ్యాకే మరో సినిమా సైన్ చేసే ఆలోచనలో ఉంది. అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాలు ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి రానున్నాయి. మరి ఈ సినిమాలతో అనుపమ మళ్ళీ హిట్స్ అందుకొని మరింత బిజీ అవుతుందా చూడాలి.