Anup Rubens to compose tunes for KothiKommachi

Wednesday,September 23,2020 - 12:20 by Z_CLU

ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ మేఘామ్ష్ శ్రీహరి , సమీర్ వేగేశ్న లతో 'KothiKommachi'అనే క్యాచీ టైటిల్ తో యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ జానర్ లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు Anup Rubens సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సినిమాలో ఐదు పాటలు ఉంటాయని, అనుప్ కథకి తగ్గట్టుగా మంచి పాటలు సమకూరుస్తున్నారని దర్శకుడు వేగేశ్న సతీష్ తెలియజేసారు. విజయదశమికి పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ సినిమా నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై MLV సత్యనారాయణ (సత్తి బాబు) నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్స్ ఫైనల్ కావాల్సి ఉంది.