Ante Sundaraniki Trailer Review

Friday,June 03,2022 - 06:57 by Z_CLU

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు విడుదలైన ట్రైలర్ ‘అంటే సుందరానికీ’ చిత్రంపై అంచనాలని ఇంకాస్త పెంచింది. సుందర్, లీలా థామస్ పాత్రలో నాని, నజ్రియాల ప్రేమకథ సరికొత్తగా, మ్యాజికల్ గా అనిపిస్తుంది. ట్రైలర్ లో కనిపించిన ప్రతి పాత్ర నవ్వులు పంచింది.

ట్రైలర్ లో చూపించిన ‘అంటే సుందరానికీ’ కథ నేపధ్యం చాలా ఆసక్తికరంగా ఉంది. సుందర్, లీలా వి వేరు వేరు ప్రపంచాలు. వారి కుటుంబాలు కూడా పూర్తిగా భిన్నం. సుందర్ కి ఒక పెద్ద కల వుంది. దాన్ని సాధించడానికి వాళ్ళే కుటుంబమే పెద్ద అడ్డంకి, ఇది చాలదన్నట్టు లీల, సుందర్ జీవితంలోకి వస్తుంది. తర్వాత కథ ఎలాంటి ఆసక్తికర మలుపు తిరిగిందనేది ‘అంటే సుందరానికీ’ కథ.

ట్రైలర్ లో నాని మార్క్ నటన, టైమింగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయ బ్రహ్మణ కుర్రాడిగా సరిగ్గా సరిపోయాడు. సుందర్ పాత్రలో అమాయకత్వంతో పాటు చాలా వైవిధ్యం ఉంది. లీలా పాత్రలో నజ్రియా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.

దర్శకుడు వివేక్ ఆత్రేయ మార్క్ ఫన్ అడుగడుగునా కనిపించింది. రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా కొత్తగా ఉంది. ట్రైలర్ చివర్లో వచ్చిన టీవీ ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలిచింది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగుంది.

జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది అంటే సుందరానికీ సినిమా.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics