Another Title discussion on NTR , Trivikram film ?

Friday,December 11,2020 - 06:57 by Z_CLU

NTR, Trivikram కాంబినేషన్ లో రాబోతున్న NTR30 సినిమాకు సంబంధించి వివిధ టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటి వరకు ఈ సినిమాకు సంబంధించి 'అయినను పోయి హస్తినాకు' అనే టైటిల్ సోషల్ మీడియాలో రౌండ్స్ కొట్టింది. ఫ్యాన్స్ కి కూడా ఈ టైటిల్ బాగా రీచ్ అయ్యింది. అయితే ఇప్పుడు మరో టైటిల్ డిస్కషన్ లో ఉందంటూ ప్రచారం మొదలైంది.

అరవింద సమేత తర్వాత మళ్ళీ తారక్ , త్రివిక్రమ్ కాంబోలో రానున్న ఈ సినిమాకు 'రాజా వచ్చినాడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. నిజానికి ఈ వార్తను ఈజీగా కొట్టి పారేయలేము. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించి ఇటివలే అన్ని టైటిల్స్ ముందు సోషల్ మీడియాలో ఇలా చక్కర్లు కొట్టినవే. వాటినే ఫైనల్ చేసి ఫస్ట్ లుక్ వదిలారు.

ఇప్పుడీ సినిమా టైటిల్ కూడా ఇందులో ఒకటి అయి ఉండవచ్చు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. హారికా హాసినీ క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై రాధాకృష్ణ , కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు.