Anjali in F3 Movie

Thursday,April 15,2021 - 03:57 by Z_CLU

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన 'F2'ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా F3 తెరకెక్కుతుంది. వెంకటేష్ , వరుణ్ సరసన తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో తాజాగా ఇంకో హీరోయిన్ ని కూడా తీసుకున్నారట మేకర్స్.

అవును.. వకీల్ సాబ్ లో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన అంజలి ఈ సినిమాలో నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం 'వకీల్ సాబ్' పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ తో బిజీగా ఉన్న అంజలి త్వరలోనే సెట్ లో జాయిన్ అవుతుందట.

vakeelsaab fame beautiful heroine anjali

నిజానికి ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ని తీసుకున్నారు. ఆమె పై కొన్ని సన్నివేశాలు కూడా తీశారని టాక్. కానీ ప్రస్తుతం సోనాల్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. సోనాల్ రోల్ నే ఇప్పుడు అంజలితో చేయిస్తున్నారని ఇన్సైడ్ టాక్. సినిమాలో వెంకటేష్ , వరుణ్ లతో సునీల్ కూడా ఓ కీ రోల్ లో కనిపించనున్నాడు. మరి అంజలి సునీల్ భార్య పాత్రలో నటిస్తుందా ? లేదా ఏదైనా ఇంపార్టెంట్ రోలా ? అనేది తెలియాల్సి ఉంది.

f3 movie

ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని, ఈసారి అనిల్ రావిపూడి ఎంటర్టైన్ మెంట్ డోస్ పెంచి ఈ సీక్వెల్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఆగస్ట్ 27న థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ నవ్విస్తుందో చూడాలి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics