Anita reveals her pregnancy matter

Sunday,October 11,2020 - 04:22 by Z_CLU

నువ్వు-నేను సినిమాతో పాపులరైన హీరోయిన్ అనిత తల్లికాబోతోంది. తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అనిత స్వయంగా ప్రకటించింది. 2013లో బిజినెస్ మేన్ రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది అనిత. ఇన్నాళ్లకు ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.

తెలుగులో నువ్వు-నేను సినిమాతో పాటు మరెన్నో సినిమాలతో పేరుతెచ్చుకుంది అనిత. ఆ తర్వాత హిందీ సినిమాల్లో కూడా నటించింది. నార్త్ లో ఆమె సీరియల్స్ తో సూపర్ పాపులర్ అయింది. ఇప్పుడు ఓటీటీలో లీడ్ లో కొనసాగుతోంది.

రీసెంట్ గా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది అనుష్క శర్మ. ఆ తర్వాత కరీనా కపూర్ కూడా మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు అనిత కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. పెళ్లయినా వీళ్లంతా తమ కెరీర్స్ ను హ్యాపీగా కొనసాగిస్తున్నారు. క్రేజ్ కంటిన్యూ చేస్తున్నారు.