Anirudh music for RC15 ?

Thursday,February 25,2021 - 01:19 by Z_CLU

రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్ లో ఇటివలే ఎనౌన్స్ అయిన RC15 సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే  క్యాస్టింగ్ తో పాటు టెక్నిషియన్స్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట శంకర్. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

తన బేనర్ లో తెరకెక్కనున్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు కూడా కాస్ట్ అండ్ క్రూ విషయంలో ఎక్కడా తగ్గడం లేదట. శంకర్ ఎవరిని ఒకే చేస్తే వారిని దిల్ రాజు ఫైనల్ చేస్తున్నాడట.

ఈ ప్రచారం కనుక నిజమైతే ఇప్పటికే తెలుగులో 'అజ్ఞాతవాసి', 'గ్యాంగ్ లీడర్','జెర్సీ' సినిమాలకు మ్యూజిక్ అందించి ఆ పాటలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అనిరుద్ మరోసారి ఈ క్రేజీ కాంబో మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రానుంది.